Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

పెద్దకాపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌కు క్యూరియా ఫార్మా చేయూత – సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్ విరాళం

06-03-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి చొరవతో క్యూరియా ఫార్మా సంస్థచేయూతనందించింది. పాఠశాలకు రూ.2.20 లక్షల విలువైన సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్‌ను అందించిన సంస్థ ప్రతినిధులను శుక్రవారం పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీఠం శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్యూరియా ఫార్మా కంపెనీ హైదరాబాద్ సైట్ హెడ్ మురళీకృష్ణ, హెచ్‌ఆర్ హెడ్ చిక్కాల వెంకట్, సీనియర్ హెచ్‌ఆర్ బోనగిరి జ్యోతి, సౌమిత్రలకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు.

గత నెలలో గ్రామానికి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి ఆవుల రాఘవేందర్ సూచన మేరకు ఈ సాయం అందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన క్యూరియా పరిశ్రమలో పరిశోధనాత్మక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆయన చొరవతో పాఠశాలలో సైన్స్ ల్యాబ్ అభివృద్ధికి అవసరమైన ఫర్నిచర్‌ను సంస్థ బహూకరించింది.ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సంస్థ ఎల్లప్పుడూ సహకరిస్తుందని చెప్పారు. విద్యార్థులు మెరుగైన సదుపాయాలతో చదువుకొని ఉన్నతస్థానాలనుఅధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆవుల జానయ్య, ఆవుల రాము, తాటి చంద్రమౌళి, గుండెబోయిన నరసింహ, గుజరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెద్దకాపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌కు క్యూరియా ఫార్మా చేయూత – సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్ విరాళం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News