Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

పేద ప్రజలకు కోమటిరెడ్డి జననం వరం.పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్

23-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మంత్రి జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

భువనగిరి, : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జననం తెలంగాణ పేద ప్రజలకు ఒక వరమని పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్ పేర్కొన్నారు. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శనివారం పేద రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

23వ వార్డు మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోత్నక్ ప్రమోద్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత 35 ఏళ్లుగా ప్రజాసేవలో కొనసాగుతూ యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరణ నిరాహార దీక్ష చేపట్టి మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.

పేద, మధ్యతరగతి విద్యార్థులు, యువతకు అండగా నిలుస్తూ ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా విద్యా సేవలు అందిస్తున్నారని తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ సేవాదళ్ అధ్యక్షుడు డాకూరి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు గ్యాస్ చిన్న, పోకల నాగరాజు, చిన్నగారి బలరాం, నువ్వుల రాజు, మసూద్, జంగిటి వరుణ్, దాసరి మధు, మణికంఠ, సాయి, మాధవరెడ్డి, సిద్ధూ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేద ప్రజలకు కోమటిరెడ్డి జననం వరం.పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News