Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

నేటి విద్యార్థులే భావి భారత నిర్మాతలు : డీఎస్పీ వెంకటరెడ్డి

25-05-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించిన సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భారత దేశ నిర్మాతలని అన్నారు. వేసవి సెలవులను వృథా చేయకుండా విద్యార్థుల్లో మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేలా క్రీడలు, యోగ, సంగీతం, చిత్రకళ, బ్యూటీషన్ తదితర అంశాలలో ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం విద్యార్థులు సెల్‌ఫోన్ వ్యామోహంలో పడుతూ ఆటపాటలు, సృజనాత్మక కార్యక్రమాలకు దూరమవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఈ సమ్మర్ క్యాంపు వారిలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు ఎంతో దోహదపడిందన్నారు. గత 15 రోజులుగా విద్యార్థులు నేర్చుకున్న ప్రతిభను ప్రదర్శించడం ఆనందంగా ఉందని కొనియాడారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీజీహెచ్‌ఎం మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు యాదగిరి, రాజశేఖర్, అశోక్ గౌడ్, చంద్రశేఖర్ ఆచార్య, డాక్టర్ రాజయ్య, గురునాథ్, ధన్‌సింగ్, లీపు ఆర్టిస్టు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నేటి విద్యార్థులే భావి భారత నిర్మాతలు : డీఎస్పీ వెంకటరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News