Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:39 AM

పేద విద్యార్థులకు ఉచితంగా న్యాయవిద్య అందిస్తున్నాం.. లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మానస

02-04-2026 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పేద విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తున్నట్లుగానే స్వశక్తితో ఎదగడానికి న్యాయవిద్య దోహదపడుతుందని సాంఘిక సంక్షేమ గురుకుల న్యాయ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మానస తెలిపారు. గురువారం చైతన్యపురిలోని కళాశాలలో ఆమె మాట్లాడారు. 2020లో స్థాపించబడిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా న్యాయ కళాశాల, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. భారతదేశంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ మహిళా న్యాయ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే ఆమోదించబడిన మా కళాశాలలో తెలంగాణ లా సెట్ ర్యాంకుల ఆధారంగా ఎస్సీ విద్యార్థులకు 75% రిజర్వేషన్‌తో 120 సీట్ల ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న మా కళాశాల అద్భుతమైన మౌలిక సదుపాయాలను అత్యంత అర్హత కలిగిన అధ్యాపక బృందాన్ని కలిగి ఉందని గ్రామీణ వెనుకబడిన తరగతి విద్యార్థులకు ఇంటర్మీడియట్ పూర్తిచేసిన మహిళా విద్యార్థులకు నాణ్యమైన ఉచిత న్యాయవిద్యను అందిస్తున్నట్లు తెలిపారు. మా 2025 బ్యాచ్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఇందులో 32 మంది విద్యార్థులు ఎల్ ఎల్ ఎం సీట్లు సాధించారని వివరించారు. వీరిలో ఇద్దరు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా లో సీటు పొందారని మా పూర్వ విద్యార్థులు న్యాయవాదులుగా, విద్యావేత్తలుగా, నాయకులుగా రాణించారన్నారు. వీరిలో 13 మంది బహుళజాతి కంపెనీలలో పనిచేస్తుండగా 15 మంది హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని మరికొందరు సమాజానికి గణనీయమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. మూట్ కోర్టులు, మాక్ పార్లమెంట్ వంటి సహ-పాఠ్య అదనపు-పాఠ్య కార్యకలాపాల ద్వారా మేము సంపూర్ణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ చర్చలు, క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక న్యాయానికి దేశ నిర్మాణానికి కట్టుబడి ఉండే క్రమశిక్షణ, గౌరవం, బాధ్యత గల పౌరులను, న్యాయవాదులను తీర్చిదిద్దడమే మా లక్ష్యమన్నారు. న్యాయవిద్య అభ్యసించాలంటే ప్రైవేట్ కళాశాలలో లక్షలలో ఫీజులు ఉంటాయని అవేవీ లేకుండా తాము ఉచితంగా న్యాయ విద్య అందజేస్తున్నట్లు తెలిపారు.

Sthanikam

పేద విద్యార్థులకు ఉచితంగా న్యాయవిద్య అందిస్తున్నాం.. లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మానస

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News