Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:29 AM

పీఆర్టీయూ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం. విద్యార్థుల విజయాలు జిల్లాకు గర్వకారణం : మంత్రి వాకిటి శ్రీహరి

29-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదో తరగతి ప్రతిభావంతుల విద్యార్థులకు ఘన సన్మానం

:పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించి అవార్డులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక మాట్లాడుతూ విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు జనార్దన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రఘువీర్, జేఎల్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పీఆర్టీయూ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం. విద్యార్థుల విజయాలు జిల్లాకు గర్వకారణం : మంత్రి వాకిటి శ్రీహరి

Article Image

పదో తరగతి ప్రతిభావంతుల విద్యార్థులకు ఘన సన్మానం

:పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించి అవార్డులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక మాట్లాడుతూ విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు జనార్దన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రఘువీర్, జేఎల్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News