Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:25 AM

పీఆర్సీ, ఓపీఎస్ డిమాండ్‌తో అంబేద్కర్ యూనివర్సిటీలో నిరసన

17-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణతో పాటు ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉద్యోగులు శుక్రవారం నిరసన చేపట్టారు.

తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు విశ్వవిద్యాలయంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లను వ్యక్తం చేశారు.

పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని, ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు జారీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాంతం ప్రేమ్ కుమార్, విశ్వనాథ్, మియాజాని, పాండు, అశోక్, భరత్ రెడ్డి, డా. యకేష్ దైదా, సుహాసిని, భూలక్ష్మి, నాగలత, తిరుపతమ్మ, జ్యోతీ శ్రీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పీఆర్సీ, ఓపీఎస్ డిమాండ్‌తో అంబేద్కర్ యూనివర్సిటీలో నిరసన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News