Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:27 AM

పట్టణ సమస్యలపై సిపిఎం పోరుబాట.

పట్టణ సమస్యలపై సిపిఎం పోరుబాట.

పట్టణ సమస్యలపై సిపిఎం పోరుబాట.
18-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పట్టణంలో పేరుకే అభివృద్ధి జరుగుతుందని, వాస్తవానికి ప్రజలు తీవ్రమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు మండిపడ్డారు. సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ… పారిశుద్ధ్యంపై పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మురికికాలువలు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో దోమలు, ఈగలు, పందులు విస్తరిస్తున్నాయని, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు.

పాత సీసీ రోడ్లు ధ్వంసమై ప్రమాదాలకు దారి తీస్తున్నాయని, హరిజనవాడ–అలీసాబ్‌గుట్ట ప్రధాన నీటి పైపులైన్ లీకేజీ కారణంగా దుర్వాసన వ్యాపిస్తోందని చెప్పారు. గుంటల్లో పందులు చనిపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చేతిపంపుల మరమ్మతులు సగంలోనే వదిలేయడంతో నీటి సమస్య మరింత తీవ్రమైందని, ఎండాకాలం దృష్ట్యా వెంటనే మరమ్మతులు చేయాలని లేదా మోటార్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

పట్టణ సమస్యలపై పలుమార్లు గ్రామపంచాయతీకి వినతిపత్రాలు అందించినా స్పందన లేదని, సమస్యలు పరిష్కరించకపోతే గ్రామపంచాయతీ, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కందుల హనుమంతు, గొరిగే సోములు, మునికుంట్ల లెనిన్, ఆముద ఆంజనేయులు, భావాండ్లపల్లి సత్యం, పల్లె సత్యం, రాసాల రమేష్, గొరిగే మల్లేశం, బండారు రాకేష్, మునికుంట్ల రాణి, సిద్ధమ్మ, పర్స అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పట్టణ సమస్యలపై సిపిఎం పోరుబాట.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News