Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:24 AM

పసి హృదయాల పెద్ద మనసు.

పసి హృదయాల పెద్ద మనసు.

పసి హృదయాల పెద్ద మనసు.
18-04-2026 411 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్నేహితురాలి కుటుంబానికి విద్యార్థినుల ఆర్థిక సహాయం

బిబినగర్: చిన్న వయసులోనే పెద్ద మనసును చాటుకున్న గురుకుల విద్యార్థినుల ఉదారత అందరినీ కదిలించింది. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, బిబినగర్‌లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినులు తమ సహ చదువరి మృతి నేపథ్యంలో మానవత్వాన్ని చాటుకున్నారు.

మునిపంపుల గ్రామానికి చెందిన మెడి లాస్య ఇటీవల మృతిచెందగా, ఈ విషాదంతో ఆమె కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. పరీక్షలు పూర్తయ్యిన అనంతరం లాస్యతో కలిసి చదువుకున్న సహ విద్యార్థినులు ఆమె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అంతటితో ఆగకుండా, తమ వంతుగా ఆర్థిక సహాయం సేకరించి బాధిత కుటుంబానికి అందజేశారు. చిన్న వయసులోనే ఇంతటి సహానుభూతి, మానవత్వం చూపిన విద్యార్థినుల చర్యను గ్రామస్థులు ప్రశంసించారు. ఈ ఉదారత సమాజానికి స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో సుక్క వరలక్ష్మి, మేఘన, రేణు శ్రీ, భవ్య శ్రీ, ఇందు సహారా, అక్షయ, లక్ష్మీ ప్రసన్న, కీర్తి తులసి, శ్రీజ, భావన, యువదీప్తి, వింద్య, ప్రవళిక, తులసి, శరణ్య, దివ్య, నిహారిక, సమీరా, శివాని తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పసి హృదయాల పెద్ద మనసు.

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News