Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

పశు ఔషధ బ్యాంకుకు విరాళం .. !!

పశు ఔషధ బ్యాంకుకు విరాళం .. !!

పశు ఔషధ బ్యాంకుకు విరాళం .. !!
04-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ పశు ఔషధ బ్యాంక్ నకి వరుసగా మూడవ నెల విరాళం

చలమల్ల వెంకట లక్ష్మారెడ్డి దానగుణం వెలకట్టలేనిది

⁠డా. పి.పెంటయ్య, అసిస్టెంట్ డైరెక్టర్

ఎవరైనా దానగుణం తో ఒకసారి విరాళమిస్తారు, లేదంటే సంవత్సరానికోసారి ఇస్తారు. అదే పశువులకోసం అయితే ఇలాంటి దాతలు అత్యంత అరుదు. వీరు మాత్రం పశు ఆరోగ్య సేవే పరమావధిగా భావించి జనవరి నుండి ప్రతీ నెలా క్రమం తప్పకుండా నెలకి అయిదు వేల రూపాయల అత్యవసర పశు ఔషధాలను కోదాడ పశు ఔషధ బ్యాంక్ నకు అందజేయడం అత్యంత విశేషం.

వివరాల్లోకి వెళ్తే కోదాడ పట్టణంలో. నీటిపారుదల శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు సత్యసాయి సేవాట్రస్ట్ జిల్లా కమిటీ సభ్యులు చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి మూగజీవాలపై అనిర్వచనీయమైన ప్రేమాభిమానాలతో పశు ఔషధ బ్యాంక్ నకు ఈ నెల కూడా పశు ఔషధాలను విరాళంగా అందించి జీవులపై ప్రేమాభిమానాలు పంచుతున్నారు .

గతం లో పశు ఔషధాలతో పాటు ఇంతవరకు ఎవ్వరూ అందించని విధంగా ఇండైరెక్ట్ ఆప్తాల్మోస్కోప్ సైతం అందించారు.

ఇచ్చిన మాట ప్రకారం మూగజీవాలకోసం, వాటియజమానులపై ఆర్ధికభారం తగ్గించి పశుపోషణ లాభసాటిగా మార్చడం కోసం తన వంతుగా నిరంతరం కొనసాగుతున్న చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి దాతృత్వం వెలకట్టలేనిది అని అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశంసించారు .

ఔషధపంపిణీ కార్యక్రమములో కోదాడ మండల పశువైద్యాధికారి డా. భూక్యా మధు, అనంతగిరి మండల పశువైద్యాధికారి డా . సిరిపురపు సురేంద్ర సిబ్బంది రాజు, చంద్రకళ , బాలచంద్ర పాల్గొన్నారు

Sthanikam

పశు ఔషధ బ్యాంకుకు విరాళం .. !!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News