Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:35 AM

పరిశ్రమలపై అవగాహన కోసం విద్యార్థుల పర్యటన

01-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బీకాం, బీబీఏ (రిటైల్ ఆపరేషన్స్) తృతీయ సంవత్సరం విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా స్వామి రామానంద తీర్థ గ్రామీణ శిక్షణ సంస్థతో పాటు భూదాన్ పోచంపల్లి చేనేత పరిశ్రమను సందర్శించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్షిప్, పరిశ్రమలపై అవగాహన పెంపొందించేందుకు ఈ పర్యటన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కామర్స్ విభాగాధిపతి డాక్టర్ పి. రమాదేవి మాట్లాడుతూ అకాడమిక్ విద్యతో పాటు ప్రాక్టికల్ అనుభవం కల్పించడమే లక్ష్యమన్నారు.

గ్రామీణ శిక్షణ సంస్థలో డాక్టర్ కిషోర్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ఎన్. విహారి కృష్ణ విద్యార్థులకు వివిధ కోర్సులు, వాటి ద్వారా లభించే ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై వివరించారు. ఉచిత శిక్షణ, హాస్టల్ వసతి, ప్లేస్‌మెంట్ సౌకర్యాల గురించి తెలియజేశారు. శిక్షణ నిపుణులు వసంత రాణి కూడా విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.

అలాగే కళాశాల–సంస్థ మధ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకునే అంశంపై ఇరువర్గాలు ఆసక్తి వ్యక్తం చేశాయి.

అనంతరం విద్యార్థులు భూదాన్ పోచంపల్లి చేనేత పరిశ్రమను సందర్శించి ఇక్కత్ వస్త్రాల తయారీ, మగ్గాలపై నేసే విధానం, మార్కెటింగ్ ప్రక్రియలను ప్రత్యక్షంగా చేనేత కారుల ద్వారా తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు, డాక్టర్ పి. రమాదేవి, డాక్టర్ ఎస్. సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఎస్. శారద, ఎన్. బాల, మరియదాస్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పరిశ్రమలపై అవగాహన కోసం విద్యార్థుల పర్యటన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News