Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:13 PM

పరీక్షలకు భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో రాయండి: కలెక్టర్ అనురాగ్ జయంతి

06-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అందులో పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.

పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ రాబోయే బోర్డు పరీక్షలపై పలు సూచనలు చేశారు. పరీక్షల సమయంలో భయపడకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కొన్ని సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.

అనంతరం పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాబ్‌లలో విద్యార్థులకు అందిస్తున్న శిక్షణపై వివరాలు తెలుసుకుని తగు సూచనలు చేశారు. అలాగే పాఠశాల డార్మిటరీ గదులను కూడా పరిశీలించారు.

మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. వంటకు అవసరమైన కూరగాయలు, గుడ్లు, కందిపప్పు, పండ్లు తదితర పదార్థాలు ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పరీక్షలకు భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో రాయండి: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News