Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:47 AM

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు – ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్

13-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒత్తిడికి లోనవ్వకుండా బోర్డు పరీక్షలు రాయాలి

విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఆత్మస్థైర్యంతో బోర్డు పరీక్షలు రాయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్ సూచించారు.

ఎస్‌ఎఫ్‌ఐ రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో గత ఆదివారం పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రామన్నపేట మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్‌లో బహుమతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పుట్టల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మంచి ఫలితాలు సాధించి తమకు, తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే జిల్లాలో రామన్నపేట మండలం ప్రథమ స్థానంలో నిలిచేలా విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

టాలెంట్ టెస్ట్‌లో మండల స్థాయిలో మొదటి బహుమతి కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్‌కు చెందిన సుంచు ప్రణతి, ద్వితీయ బహుమతి వివేకానంద హై స్కూల్‌కు చెందిన కట్ట హరిణి సాధించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుంగ చంటి, ఎరుముల శంకర్, భుఖ్య సంతోష్, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు – ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News