Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:36 AM

ప్రతి పిల్లవాడూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి: సర్పంచ్ రాధా శ్రీనివాస్

03-04-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని వెల్లంకి ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం గుడ్ ఫ్రైడే సెలవు రోజున కూడా నిర్వహించారు.

కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, ఉచిత విద్య అందుబాటులో ఉందని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రవేశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, పలువురు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరపత్ర దాత బత్తుల శ్రీనివాస్, AAPC చైర్‌పర్సన్ పులగం సులోచన, ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందుగుల వెంకటయ్య, కొసన మాధవి, నకిరేకంటి అశ్విని తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి పిల్లవాడూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి: సర్పంచ్ రాధా శ్రీనివాస్

Article Image

రామన్నపేట మండలంలోని వెల్లంకి ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం గుడ్ ఫ్రైడే సెలవు రోజున కూడా నిర్వహించారు.

కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, ఉచిత విద్య అందుబాటులో ఉందని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రవేశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, పలువురు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరపత్ర దాత బత్తుల శ్రీనివాస్, AAPC చైర్‌పర్సన్ పులగం సులోచన, ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందుగుల వెంకటయ్య, కొసన మాధవి, నకిరేకంటి అశ్విని తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News