Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:37 PM

ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించి మొక్కలను నాటాలి

23-07-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోదాడ పట్టణంలోని కేటీఎస్ ఉన్నత పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కోదాడ ట్రాఫిక్ ఎస్సై ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు కలిసి ఒకే రోజు 300 మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణ బాధ్యతగా మొక్కలను నాటడమే కాకుండా, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణాన్ని అందించడానికి విద్యార్థి దశ నుంచే పచ్చదనంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాల ఆవరణలో నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా కాపాడుకుంటామని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, కేటీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించి మొక్కలను నాటాలి

Article Image

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోదాడ పట్టణంలోని కేటీఎస్ ఉన్నత పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కోదాడ ట్రాఫిక్ ఎస్సై ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు కలిసి ఒకే రోజు 300 మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణ బాధ్యతగా మొక్కలను నాటడమే కాకుండా, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణాన్ని అందించడానికి విద్యార్థి దశ నుంచే పచ్చదనంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాల ఆవరణలో నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా కాపాడుకుంటామని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, కేటీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News