Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:49 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

01-04-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి:

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

బుధవారం ఆలేరు మండలం శారజీపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వార్డులు, పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. శానిటేషన్ పనులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.

ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, హాజరు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి సిబ్బంది విధులకు హాజరు నమోదు సక్రమంగా చేస్తున్నారా అనే విషయాన్ని డైలీ అటెండెన్స్ ద్వారా పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.

ప్రతిరోజూ ఓపీకి వచ్చే రోగుల సంఖ్య, వారి వివరాల నమోదు విధానాన్ని తెలుసుకుని రిజిస్టర్‌ను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి రోగి వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు.

ఆసుపత్రిలో అవసరమైన ఔషధాల లభ్యతపై ఆరా తీశారు. మందులు సరిపడా అందుబాటులో ఉంచాలని, రోగులకు అందిస్తున్న ఔషధాల వివరాలను క్రమబద్ధంగా నమోదు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి మనోహర్, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News