Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీపీఎం రాజకీయ శిక్షణతోనే పార్టీ బలోపేతం! రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 12:36 AM

ప్రతిష్టాత్మక ఐసీటీఎస్‌కు ఎన్జీ కళాశాల విద్యార్థినిల ఎంపిక..

ప్రతిష్టాత్మక ఐసీటీఎస్‌కు ఎన్జీ కళాశాల విద్యార్థినిల ఎంపిక..

ప్రతిష్టాత్మక ఐసీటీఎస్‌కు ఎన్జీ కళాశాల విద్యార్థినిల ఎంపిక..
April 01, 2026 07:25 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక జోడి..

నల్గొండ : నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ నాగార్జున (ఎన్జీ) స్వయంప్రతిపత్తి కళాశాల విద్యార్థినులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక 'టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్' (TIFR) పరిధిలోని 'ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్' (ICTS) నిర్వహించనున్న "సమ్మర్ స్కూల్ ఫర్ ఉమెన్ ఇన్ ఫిజిక్స్-2026" శిక్షణకు వీరు ఎంపికయ్యారు. ఎంపీసీ (MPC) మొదటి సంవత్సరం చదువుతున్న వుయ్యాల వీణ గౌడ్, ఎదుళ్ల పూజ రెడ్డి ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో కేవలం 60 మంది విద్యార్థినులను మాత్రమే ఈ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేశారు. కాగా తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థినులు వీరే కావడం విశేషం. జూన్ నెలలో బెంగళూరులో జరిగే ఈ శిక్షణలో భాగంగా అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తల పర్యవేక్షణలో వీరు భౌతికశాస్త్రంలోని ఆధునిక మెళకువలను నేర్చుకోనున్నారు.

కళాశాలలో ఘనంగా సన్మానం..

​జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వీణ గౌడ్, పూజ రెడ్డిలను బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ ఇతర అధ్యాపక బృందం ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ. టాటా ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రఖ్యాత సంస్థలో శిక్షణకు మన విద్యార్థినులు ఎంపిక కావడం కళాశాలకే కాక జిల్లాకే గర్వకారణం. వీరి కృషి, సైన్స్ పట్ల ఉన్న ఆసక్తి తోటి విద్యార్థులకు ఆదర్శం.ఈ అభినందన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. పరంగి రవికుమార్, భౌతికశాస్త్ర విభాగం అధిపతి డా. శ్రీనివాసరెడ్డి, అకడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, సీనియర్ అధ్యాపకులు మునగాల వెంకట్ రెడ్డి, డా. వి. వెంకటేశం, మన్యం వెంకటయ్య, డా. వెల్దండి శ్రీధర్, నర్సింగు కోటయ్య తదితర బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. 


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News