Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:37 AM

ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి. అదనపు కలెక్టర్

02-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుర్కపల్లి, పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు.

గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా నిర్వహణ ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

పరీక్షల సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు.

కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు వంటి మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పూర్తైన అనంతరం ప్రశ్నాపత్రాలను పోలీస్ బందోబస్తుతో సురక్షితంగా తరలించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి. అదనపు కలెక్టర్

Article Image

తుర్కపల్లి, పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు.

గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా నిర్వహణ ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

పరీక్షల సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు.

కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు వంటి మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పూర్తైన అనంతరం ప్రశ్నాపత్రాలను పోలీస్ బందోబస్తుతో సురక్షితంగా తరలించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News