Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

ప్రాణాలను నిలబెట్టే 'గోల్డెన్ అవర్'పై అవగాహన

17-04-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

- రోడ్డు ప్రమాద సమయాల్లో తక్షణ స్పందన అవసరం

​- 'అరైవ్ అలైవ్'లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026’ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి జిల్లా రోడ్డు భద్రత వారోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ‘గోల్డెన్ అవర్ ట్రైనింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లు, వాలంటీర్లకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.

​మొదటి గంట అత్యంత కీలకం:

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’ గా పరిగణిస్తారని, ఈ సమయంలో బాధితులకు సరైన ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో ప్రజలు భయపడకుండా తక్షణమే స్పందించాలని కోరారు.

​ప్రథమ చికిత్స: ప్రమాద స్థలంలో బాధితులను సురక్షితంగా వాహనాల నుంచి బయటకు తీయడం, రక్తస్రావం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే 100 లేదా 112 ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.

​బాధితులను అంబులెన్స్‌లోకి తరలించేటప్పుడు వెన్నెముక, మెడ భాగాలకు గాయాలు కాకుండా పాటించాల్సిన మెళకువలను వివరించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎస్ఐ ఉపేందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది,ఆసుపత్రి వైద్యులు, అంబులెన్స్ డ్రైవర్లు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రాణాలను నిలబెట్టే 'గోల్డెన్ అవర్'పై అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News