Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:09 PM

పార్లమెంట్ అనుబంధ కమిటీలపై టీడీపీ కీలక చర్చలు

06-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మంగళగిరి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ అనుబంధ కమిటీల ఏర్పాటు పై ముఖ్యమైన చర్చలు నిర్వహించారు. జోనల్–5 కోఆర్డినేటర్ బీద రవిచంద్ర, ప్రోగ్రామ్ కమిటీ ఇన్‌చార్జి రాంబాబు, కర్నూలు పార్లమెంట్ కోఆర్డినేటర్ వీరయ్య చౌదరి సూచనల మేరకు కర్నూలు జిల్లా నాయకులతో విస్తృతంగా సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జి మీనాక్షి నాయుడు, మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేందర్ రెడ్డి, ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, ఎమ్మెల్సీ బీటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్ స్థాయి కమిటీలను బలోపేతం చేసి పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత శక్తివంతం చేయాలనే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు నిర్ణయించారు.

Sthanikam

పార్లమెంట్ అనుబంధ కమిటీలపై టీడీపీ కీలక చర్చలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News