Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

ప్రకృతి వ్యవసాయంతో రైతుకు లాభాల బాట

ప్రకృతి వ్యవసాయంతో రైతుకు లాభాల బాట

ప్రకృతి వ్యవసాయంతో రైతుకు లాభాల బాట
05-03-2026 178 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ రైతు వేదికలో రైతులకు ప్రకృతి వ్యవసాయం (నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్)పై అవగాహన సదస్సు మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్, కౌన్సిలర్లు ఉదరి యాదయ్య, ఆలె శ్రీలత చిరంజీవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు దేశీయ విత్తనాలను సేకరించి వాటిని ఉపయోగించాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో రైతు కనీసం 10 గుంటల భూమిలో తన కుటుంబానికి సరిపడా వరి ధాన్యాన్ని పండించుకోవచ్చని తెలిపారు. పెట్టుబడుల కోసం రసాయనాలపై ఆధారపడకుండా రైతులే జీవామృతం, ఘన జీవామృతం తయారు చేసుకుని వాడాలని సూచించారు.రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి దాని బదులుగా వేపపిండి వాడితే వరి పంటలో కంకులు ఒకేసారి రావడంతో పాటు చీడపీడల ఉధృతి తగ్గుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ రైతులందరూ పూర్వ పద్ధతులను అనుసరించి సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరారు. వైస్ చైర్మన్ గోశిక వినయ్ మాట్లాడుతూ తంగడపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకుని రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించాలని సూచించారు. పెద్ద కొండూరు గ్రామానికి చెందిన రైతు వాకిటి రజిత గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తన అనుభవాలను రైతులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్ష పత్రాలను మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తంగడపల్లి గ్రామ రైతులు, కృషి సఖీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రకృతి వ్యవసాయంతో రైతుకు లాభాల బాట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News