Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:52 AM

ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి. అర్జీలపై ఆలస్యం వద్దు: కలెక్టర్ అనురాగ్ జయంతి

30-03-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి తో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 30 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ అర్జీలలో రెవెన్యూ శాఖకు చెందినవి 25, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు 2, హౌసింగ్ శాఖకు 2, మున్సిపాలిటీకి 1 చొప్పున వచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి. అర్జీలపై ఆలస్యం వద్దు: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి తో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 30 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ అర్జీలలో రెవెన్యూ శాఖకు చెందినవి 25, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు 2, హౌసింగ్ శాఖకు 2, మున్సిపాలిటీకి 1 చొప్పున వచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News