Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:31 AM

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చేయాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

20-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, :

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. మొత్తం 55 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏ ఒక్క అర్జీ కూడా పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అందిన దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు 40, మున్సిపాలిటీకి 5, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు 2, జిల్లా పంచాయతీకి 2, జిల్లా విద్యాశాఖకు 2 దరఖాస్తులు వచ్చాయి. కోఆపరేటివ్, ఎస్సీ కార్పొరేషన్, చేనేత, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితర శాఖలకు ఒక్కటి చొప్పున అందినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చేయాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News