Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:08 PM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం
06-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ విద్యార్థులు తమ పరిసరాల్లో చెత్త వేయకుండా చూడటం, ఇతరులను కూడా చెత్త వేయనీయకుండా చైతన్యం కల్పించడం వల్ల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటానికి దోహదపడుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు పరిశుభ్రంగా ఉండటానికి కారణం ఇలాంటి కార్యాచరణలేనని పేర్కొన్నారు.

అందువల్ల విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా ఈ 99 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం కళాశాల ఆవరణను శుభ్రపరిచే కార్యక్రమంలో భాగంగా చెత్త తొలగించడం, చెట్ల చుట్టూ గుంతలు తీయడం వంటి పనులను విద్యార్థులు, అధ్యాపకులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News