ప్రజలకు ఇచ్చిన మాటను కట్టుబడి పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం... మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న
ప్రజలకు ఇచ్చిన మాటను కట్టుబడి పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం... మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న
Bandi Kiran Kumar
తుంగతుర్తి; ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డిప్రజలకుఇచ్చిన మాట కట్టుబడి పని చేస్తున్నారని తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...
ముఖ్యమంత్రి వర్యులురేవంత్ రెడ్డి గతంలో తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను విడుదల చేశారని అన్నారు . ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర చరిత్రలో మునుపన్నడు లేనివిధంగా చాలా ఘనంగా గర్వంగా దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మ ల దర్శనం చేసుకున్నారు. వనదేవతల పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం గుడులు నిర్మాణం చేశారని అన్నారు. రైతులకు ఇచ్చి మాట ప్రకారం రైతులు పండించిన పంటకు కింటకు బోనస్ 500 రూపాయలు. రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వంకాంగ్రెస్ ప్రభుత్వం అని, నిరంతరం ఎన్నికల ప్రక్రియలో భాగంగా రైతు భరోసా కొంత జాప్యం జరిగినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా రైతు భరోసాను కొద్ది రోజుల్లోనే విడుదల చేస్తారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం . ఉచిత200 యూనిట్ల కరెంటు. 500 రూపాయలకే గ్యాస్. రైతు భరోసా. రైతు బోనస్. మహిళలకు వడ్డి లేని బ్యాంకు రుణాలు రాష్ట్రంలో ఉన్న మహిళా ఆడపడుచులకు ఇందిరమ్మ చీరలు. ఇందిరా మహిళా శక్తి భవనాలు. ఇదే కాకుండా 200 కోట్లతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఇందిరమ్మ ఇండ్ల అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కిషోర్ బాగోతం తిరుమలగిరిలో దళితులను అడిగితే ఆయన గొప్ప చరిత్ర తెలుస్తుందనీ ,బిఆర్ఎస్ నాయకులు ప్రమాణస్వీకారోత్సవాలు కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళం ఏమైనా అన్నామా. మేము ఈరోజు ప్రమాణ స్వీకారానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే జీర్ణించుకోలేని మీరు అవాకులు చివాకులు పేలడం తగదనీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఫ్లెక్సీలు చింపేస్తున్నారని అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు గడచిన రెండు సంవత్సరాల కాలంలోనే సుమారుగా 3364 కోట్ల రూపాయల తోటి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, తుంగతుర్తి నుండి వెంపటి మీద పోయే రోడ్డు పనులు శ్రీకారం చుట్టారని, తిమ్మాపురం నుండి నూతనకల్ వరకు 32 లక్షల తోటిపోస్తున్న రోడ్డు పనులు చేశారని, తిరుమలగిరి ప్రాంతంలో తొండ దగ్గర *యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్* స్కూలు ప్రారంభోత్సవం చేసింది వాస్తవం కాదా. తుంగతుర్తి కేంద్రంగా వారానికి రెండు రోజులు మూడు రోజులు క్యాంప్ ఆఫీస్ నుండి తుంగతుర్తి అభివృద్ధిని చేద్దాం అని చెప్పి *.సంత సేవాలాల్* భవన నిర్మాణం కోసం గిరిజనులకు మాట ఇచ్చింది వాస్తవం కాదాఅని, మా ప్రభుత్వ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఎక్కడ కూడా భూకబ్జాలు గాని. మర్డర్లు గాని. మానభంగాలు గాని జరగలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలనీ టిఆర్ఎస్ నాయకులకుతస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రావులపల్లి ఎక్స్ రోడ్డు తండ సర్పంచ్ గుగులోతోజ్యోతి రాము , కేశవపురం సర్పంచ్ మిరియాల శ్రీను , వీరబోయిన గంగరాజు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ. కొండ పరశురాం మండల నాయకులు. గుగులోత్ సంతోష్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎక్స్ రోడ్ తండా ,గ్రామ NSUI వర్కింగ్ ప్రెసిడెంట్ అందే పరశురాం పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి