Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:48 AM

ప్రజా ఉద్యమాలకు పాటే ప్రాణం: మాగి వెంకన్న

30-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం: ప్రజా ఉద్యమాలను ముందుకు నడిపించడంలో పాటకు అపారమైన శక్తి ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ మాగి వెంకన్న అన్నారు. తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో నిర్వహించిన అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఖమ్మం జిల్లా 7వ మహాసభలు విజయవంతంగా ముగిశాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు పాట ఉద్యమాలకు ప్రాణం పోసిందన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఒగ్గుకథలు, బుర్రకథలు, వీధి నాటకాలతో పాటు పాటలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. దొరల అహంకారాన్ని ఎదిరించడంలో, రైతాంగాన్ని మేల్కొల్పడంలో పాట ప్రధాన ఆయుధంగా నిలిచిందన్నారు.

1974లో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు నేతృత్వంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పడి 54 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలకు సేవలందిస్తున్నదని గుర్తు చేశారు. ఈ ప్రయాణంలో పలువురు కళాకారులు తమ ప్రాణాలను సైతం అర్పించి ఉద్యమాలను నిలబెట్టారని అన్నారు.

నేటి సమాజంలో ప్రజా చైతన్యాన్ని పెంచే పాటలు తగ్గిపోతున్నాయని, పాలకులకు అనుకూలంగా మారుతున్న ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పాటలు ప్రజలను మేల్కొలిపి ఉద్యమాలను బలోపేతం చేశాయని, అలాంటి సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర, జిల్లా నాయకులు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా ఉద్యమాలకు పాటే ప్రాణం: మాగి వెంకన్న

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News