Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:46 AM

ప్రజా సేవే అసలైన సంపద: మంత్రి పొంగులేటి నిధుల వినియోగంలో ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలి

12-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం, ప్రజా సేవలో భాగస్వామ్యం కావడం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజల ఆశీర్వాదాలతోనే ఈ స్థాయికి చేరుకున్నామని, పదవీ కాలం ముగిసే సమయానికి తమ గ్రామం, వార్డు అభివృద్ధి చెందిందని ప్రజలు గర్వంగా చెప్పేలా పని చేయాలని సూచించారు.

గురువారం ఖమ్మంలోని భక్త రామదాసు కాలక్షేత్రం లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

మంత్రి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇటీవలే పంచాయతీల ఖాతాల్లో గణనీయమైన నిధులు జమ అయ్యాయని, మార్చి చివరినాటికి మరిన్ని నిధులు అందనున్నాయని తెలిపారు. ఈ నిధులను ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని సర్పంచులకు సూచించారు.

అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు.

ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, గెలిచిన తర్వాత అందరూ ప్రజల సేవకులుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అన్నారు. కొత్తగా ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులకు అధికారులు పూర్తి స్థాయిలో మార్గనిర్దేశం చేసి ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి ఆకాంక్షించారు.

Sthanikam

ప్రజా సేవే అసలైన సంపద: మంత్రి పొంగులేటి నిధుల వినియోగంలో ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News