Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీపీఎం రాజకీయ శిక్షణతోనే పార్టీ బలోపేతం! రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 04:01 AM

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం..

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం..

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం..
April 02, 2026 06:08 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

99 రోజుల ప్రణాళికతో ప్రగతి పథంలోకి గ్రామాలు..

రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..


​నల్గొండ : ప్రజల చెంతకే పాలనను తీసుకువచ్చి, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న మూడేళ్ల కాలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తామని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న అన్ని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని ఇందులో భాగంగా నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్‌తో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తామని అలాగే ఎల్ కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టిక అల్పాహారం అందించే కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన 'ఇందిరమ్మ జీవిత బీమా' పథకం దేశానికే ఆదర్శమని సుమారు 3 కోట్ల 15 లక్షల మందికి దీని ద్వారా రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో ఎవరైనా మరణిస్తే ఈ బీమా పథకం ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తిప్పర్తి మండల అభివృద్ధికి సంబంధించి మంత్రి కీలక నిర్ణయాలను ప్రకటించారు. మండల కేంద్రంలో రూ. 60 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రూ. 6 కోట్లతో జూనియర్ కళాశాల, రూ. 26 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మంజూరు చేశామని వీటికి సంబంధించి త్వరలోనే జీవో రానుందని చెప్పారు. గతంలో నిధుల కొరతతో ఆగిపోయిన 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను నెల రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఇళ్ల గృహప్రవేశాల కోసం తన సొంత నిధుల నుండి ప్రతి ఇంటికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తానని మంత్రి ప్రకటించడం విశేషం.మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తిప్పర్తి మండల సమాఖ్యకు రెండు బస్సులు మంజూరు చేయడంతో పాటు పెట్రోల్ బంక్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. మహిళా సంఘాల ద్వారానే మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డీఆర్‌డీఓను అక్కడికక్కడే ఆదేశించారు. త్వరలోనే ముఖ్యమంత్రిని తిప్పర్తికి తీసుకువచ్చి మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని మంత్రి వెల్లడించారు.జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు.

ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక వెసులుబాటు కలిగిందని, మండలంలో కొత్తగా 352 రేషన్ కార్డులు మంజూరు చేశామని వివరించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని కోరారు. సర్పంచ్ రజిత అధ్యక్షతన జరిగిన ఈ సభలో అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News