Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీపీఎం రాజకీయ శిక్షణతోనే పార్టీ బలోపేతం! రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 02:40 AM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం 42వ డివిజన్‌ కార్పొరేటర్ అల్లి నాగలక్ష్మి..

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం 42వ డివిజన్‌ కార్పొరేటర్ అల్లి నాగలక్ష్మి..

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం 42వ డివిజన్‌ కార్పొరేటర్ అల్లి నాగలక్ష్మి..
April 02, 2026 05:32 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం..


​నల్గొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్‌లో గురువారం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా వార్డు సభను ఘనంగా నిర్వహించారు. స్థానిక సమస్యల గుర్తింపు, అభివృద్ధి పనుల ప్రణాళికే లక్ష్యంగా జరిగిన ఈ సభకు డివిజన్ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా 42వ డివిజన్ కార్పొరేటర్ అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ మాట్లాడుతూ.. వార్డులోని ప్రతి గల్లీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజల ముంగిటకే పాలనను తీసుకురావడంలో భాగంగా ఈ 99 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు.

గతంలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో పొరపాటున ఎవరైనా దరఖాస్తులు చేసుకోకపోయినా లేదా అప్లికేషన్లు మిస్ అయిన వారు ఉంటే నేరుగా తనను సంప్రదించి దరఖాస్తులు అందజేయాలని కార్పొరేటర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి (RO) శివరామిరెడ్డి, వార్డు ఆఫీసర్ యాదమ్మ, ఆర్.పి. సుజాత, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వార్డు జవాన్ తిరుమల్ మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. సభకు హాజరై విజయవంతం చేసిన డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News