Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:47 AM

ప్రధాని మోది సభను విజయవంతం చేయాలి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

08-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

గురువారం యాకత్‌పురా నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోది ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు రానున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, నిర్వహించనున్నారని పేర్కొన్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ, మాజీ కార్పొరేటర్లు జంగం శ్వేతారెడ్డి, కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, భాగ్యలక్ష్మి, సీనియర్ నాయకులు సహదేవ్ యాదవ్, సంరెడ్డి సురేందర్ రెడ్డి, వీరేందర్ యాదవ్, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రధాని మోది సభను విజయవంతం చేయాలి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News