Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:58 PM

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

20-04-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​మున్సిపాలిటీలో ఘనంగా 'బడిబాట' ప్రారంభం

​విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలి

ఉచిత పాఠ్యపుస్తకాలు, పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'బడిబాట' కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో బడిబాట కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమాన్ని ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయకూడదని, ఉపాధ్యాయులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సకల మౌలిక సదుపాయాలను కల్పించిందని గుర్తుచేశారు.​​విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ఆమె ఈ సందర్భంగా వివరించారు: పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్.నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారంగా రాగిజావ పంపిణీ.​మెరుగైన బోధనతో పాటు క్రీడలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన.

​"ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోంది. ప్రైవేటుకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ దేప రమ్య రాజు, స్థానిక నాయకులు బాలకృష్ణారెడ్డి, వెంకటేష్, సంతోష్, శివాజీ, సాయికిరణ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News