Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:45 AM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

11-03-2026 2,211 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోటకొండూర్: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. బుధవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధులకు హాజరవుతున్నారా లేదా అని అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆసుపత్రిలో ఎంతమంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని, ఇంకా ఏమైనా పోస్టులు ఖాళీగా ఉన్నాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోజూ వచ్చే ఓపీ రోగుల సంఖ్య, వారికి అవసరమైన పరీక్షలు ఆసుపత్రి ల్యాబ్‌లోనే చేస్తున్నారా లేదా బయటకు పంపిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. ల్యాబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షలు, రోగులకు అందిస్తున్న మందులు, వాటి నిల్వల వివరాలు స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారా లేదా అని కూడా పరిశీలించారు.

అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడిన కలెక్టర్ వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. చెకప్ కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇలా చేస్తే పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

Sthanikam

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News