Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:13 PM

ప్రభుత్వ ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

28-12-2025 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు – 2025

విందు కార్యక్రమాలు, చర్చిలకు ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లాలో క్రిస్మస్ వేడుకలు–2025ను భువనగిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి, వలిగొండ, బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో క్రైస్తవులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియోజకవర్గానికి రూ.2 లక్షల వ్యయంతో క్రైస్తవులకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే రిజిస్టర్ అయిన చర్చిలకు ఆర్థిక సహాయం కింద ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. భువనగిరి మరియు ఆలేరు నియోజకవర్గాల్లో కలిపి 100 చర్చిలకు మొత్తం రూ.30 లక్షలు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.

భువనగిరి మండలంలో నిర్వహించిన విందు కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, తహసిల్దార్‌తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ విధానాల ద్వారా అన్ని మతాలకు సమాన గౌరవం, సంబరాల నిర్వహణ జరుగుతున్నదని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాలు నియోజకవర్గంలో మత సామరస్యాన్ని మరింత బలపరిచాయని ప్రజలు అభిప్రాయపడ్డారు.

Sthanikam

ప్రభుత్వ ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News