Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 08:01 AM

పోలీస్ కార్యాలయంలో  ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ..

02-06-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..

నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి చిత్రపటానికి అదనపు ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించారు.

అమరుల ఆశయ సాధనకు పునరంకితం కావాలి..

వేడుకలను ఉద్దేశించి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులు, విద్యార్థులు, అమరవీరుల సేవలు చిరస్మరణీయమన్నారు. వారి ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు పారదర్శకమైన, అత్యంత బాధ్యతాయుతమైన సేవలందించేందుకు పోలీస్ యంత్రాంగం నిరంతరం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. ప్రజలకు మరింత సత్వర, పారదర్శక సేవలు అందించేలా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. ఈ వేడుకల్లో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాం రెడ్డి, రవి కుమార్, శ్రీనివాసులు, వివిధ పోలీస్ స్టేషన్ల సీఐలు, ఆర్.ఐ లు, ఎస్సైలు, మినిస్టీరియల్ సిబ్బంది, మహిళా పోలీసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సంబరాల అనంతరం సిబ్బంది ఒకరికొకరు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Sthanikam

పోలీస్ కార్యాలయంలో  ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News