Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:09 AM

ప్లాస్టిక్ తగ్గిద్దాం… భవిష్యత్తు కాపాడుదాం!

04-03-2026 163 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నీటి సంరక్షణ–చెట్ల పెంపకం–ఎకోబ్రిక్స్‌పై అవగాహన

పర్యావరణానికి, ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సహస్ర ఫౌండేషన్ అధ్యక్షుడు చినుకని యువరాజు పేర్కొన్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తులను తగ్గించి, పునర్వినియోగం, రీసైక్లింగ్ ద్వారా కాలుష్యాన్ని అరికట్టవచ్చని తెలిపారు. పురపాలక కేంద్రంలోని గ్రీన్ గ్రోవ్ స్కూల్ లో జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.నీరు వృథా కాకూడదు భూగర్భ జలాల సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, నీటిని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంటిలో నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.చెట్టు నాటితేనే జీవనాట్యం చెట్లను నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదేనని తెలిపారు. చెట్లు ఉన్నప్పుడే మానవ మనుగడ సాధ్యమని విద్యార్థులకు వివరించారు. ఎకోబ్రిక్స్‌తో ప్లాస్టిక్ నివారణ రోజువారీగా వాడే ప్లాస్టిక్ వ్యర్థాలను ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లలో నింపి ‘ఎకోబ్రిక్’లుగా తయారు చేసి పునర్వినియోగం చేయాలని సూచించారు. చిన్నచిన్న చర్యలే పెద్ద మార్పుకు దారి తీస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్-కమ్-ప్రిన్సిపల్ ఎస్. లక్ష్మి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్లాస్టిక్ తగ్గిద్దాం… భవిష్యత్తు కాపాడుదాం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News