Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను కాపాడుకోండి: వ్యవసాయ అధికారి సంతోష్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:19 PM

పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లలో గందరగోళం

29-12-2025 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన డివిజన్ల లోపాలు: బిఆర్ఎస్ పార్టీ ఆందోళన

హైదరాబాద్: స్థానికం ప్రతినిధి

కొత్తగా ఏర్పడిన పెద్ద అంబర్ పేట్ మరియు కుంట్లూరు డివిజన్ల నిర్వహణపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ దండెం రాంరెడ్డి మాట్లాడుతూ, “ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే ఉన్నారా.. లేరా..? ప్రజలకు అర్థం కావడం లేదు” అని పేర్కొన్నారు.

రాంరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, వ్యవసాయం మీద ఆధారపడిన నాలుగు గ్రామాలను పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ లో కలిపి, జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకువచ్చడంతో గ్రామాల ప్రజలపై అదనపు టాక్స్ భారము పడుతోందని, అందువల్ల అనేక ప్రాంతాల్లో అయోమయ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఎల్బీనగర్ జోన్ లోని పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లను హయాత్నగర్ సర్కిల్ లో కలపాలని, నాగోల్ సర్కిల్ వద్ద కాకుండా పక్కన ఏర్పాటు చేయాలని సూచించారు.

రాంరెడ్డి తెలిపారు, పెద్ద అంబర్ పేట్ డివిజన్‌లో 55,000 పైచిలుకు, కుంట్లూరు డివిజన్‌లో 12,000 పైచిలుకు ఓటర్ల వ్యత్యాసం ఉంది. కుంట్లూరు ప్రాంతానికి రెవెన్యూ సదుపాయం లేకపోవడం, తట్టి అన్నారం కలిపి ఒక డివిజన్ చేయడం వల్ల లోపాలు ఏర్పడినట్టు తెలిపారు. ఈ విషయంపై కమిషనర్ కు మెమోరాండం అందజేయడం జరిగినట్టు చెప్పారు.

రాంరెడ్డి స్థానిక ఎమ్మెల్యే పునరాలోచన చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే కోర్టులో న్యాయపరంగా హక్కులు సాధిస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఈదమ్మల్ల బలరాం, మాజీ సర్పంచ్ కళ్ళెం ప్రభాకర్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు అర్చన దామోదర్, మండల కోటేశ్వర్ రావు, తొండెపు రోహిణి బ్రహ్మానంద రెడ్డి, దేసారం బాలకృష్ణ గౌడ్, పిల్లి నగేష్ యాదవ్, భాస్కర్ గౌడ్, మైనారిటీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, సీనియర్ నాయకులు జోర్క రాము, గాదె శేఖర్, పత్తి రవికాంత్, ఊటుకూరి కర్నాకర్, గాయాల రాము, పండుగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లలో గందరగోళం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News