Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

పదో తరగతి విద్యార్థినులకు లక్ష్య సాధనపై పోలీసుల అవగాహన ఎస్ఐ క్రాంతి కుమార్.

06-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మోటివేషన్ పెంపొందించేందుకు తుంగతుర్తి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం తుంగతుర్తి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు ‘లక్ష్యాలు సాధించడం’ అంశంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని చదువులో నిరంతరం కృషి చేయాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోనుకాకుండా మనసుపెట్టి చదవాలని అన్నారు.

పాఠ్యాంశాల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని, శ్రద్ధతో, ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులను ప్రోత్సహించారు.

విద్యార్థులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Sthanikam

పదో తరగతి విద్యార్థినులకు లక్ష్య సాధనపై పోలీసుల అవగాహన ఎస్ఐ క్రాంతి కుమార్.

Article Image

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మోటివేషన్ పెంపొందించేందుకు తుంగతుర్తి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం తుంగతుర్తి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు ‘లక్ష్యాలు సాధించడం’ అంశంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని చదువులో నిరంతరం కృషి చేయాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోనుకాకుండా మనసుపెట్టి చదవాలని అన్నారు.

పాఠ్యాంశాల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని, శ్రద్ధతో, ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులను ప్రోత్సహించారు.

విద్యార్థులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News