Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:28 AM

ఓటరు జాబితా సవరణలో వేగం పెంచండి. సుదర్శన్ రెడ్డి

20-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ 95 శాతానికి పైగా పూర్తైందని, తెలంగాణలో కూడా అదే స్థాయిలో పనులు పూర్తి చేసేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈఆర్ఓలు, ఏఈఆర్వోలు తమ పరిధిలోని బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓలు), సూపర్వైజర్లకు స్పష్టమైన మార్గనిర్దేశం ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.

రాజకీయ పార్టీల ఏజెంట్ల నియామకంపై ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో, వారి సహకారాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పరిధిలోని బిఎల్ఓలతో సమన్వయం పెంచుకుని మ్యాపింగ్ పనులను స్వయంగా పర్యవేక్షిస్తే మిగిలిన ప్రాంతాల్లో పనులు త్వరితగతిన పూర్తి అవుతాయని వివరించారు. ఈ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి పాల్గొన్నారు. అలాగే భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్, ఎలక్షన్స్ సెల్ సూపరింటెండెంట్ కృష్ణ తదితర అధికారులు హాజరయ్యారు.

Sthanikam

ఓటరు జాబితా సవరణలో వేగం పెంచండి. సుదర్శన్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News