ఆత్మకూర్‌లోని వైబీఆర్ గార్డెన్స్‌లో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు రాధారపు సాయినాధ్–రమ్యల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, బీఆర్‌ఎస్ మండల నాయకుడు రాస వెంకటేష్, బీజేపీ నాయకులు రాజన్నగారి రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకుడు చిన్నపాక శ్రీనివాస్, చిన్నపాక సురేష్, కాటపల్లి మహేష్, నల్ల నెహ్రు బాబు, తుమ్మల నర్సింహా తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి