Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:21 AM

నూజివీడులో మామిడి కొనుగోలుదారులు–విక్రేతల సమావేశం

08-03-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు: ఏలూరు జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి ఉత్పత్తిదారులు మరియు కొనుగోలుదారుల అనుసంధాన సదస్సు “నూజివీడు మామిడి బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్–2026” ఈ నెల 10వ తేదీ మంగళవారం నిర్వహించనున్నారు. నూజివీడు పట్టణంలోని కోనేరుపేటలో ఉన్న టి.టి.డి కళ్యాణ మండపంలో ఈ సదస్సు జరగనుంది.

ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

గౌరవ అతిథులుగా ఫుడ్ ప్రాసెసింగ్ సోసైటి ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఐఎఫ్‌ఎస్ రిటైర్డ్) చిరంజీవి చౌదరి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్ హరినాథ్ రెడ్డి పాల్గొంటారు.

అలాగే డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం పరిశోధన విభాగం డైరెక్టర్ జి. రామనందం, నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బి. కనకమహాలక్ష్మి, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. రామ్మోహన్ కూడా పాల్గొని రైతులకు మార్గదర్శనం చేయనున్నారు.

జిల్లా ఉద్యాన అధికారి కె. షాజానాయక్, నూజివీడు ఉద్యాన అధికారిణి ఆర్. హేమ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా వ్యవహరిస్తున్నారు. మామిడి రైతులు, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని అధికారులు కోరారు.

Sthanikam

నూజివీడులో మామిడి కొనుగోలుదారులు–విక్రేతల సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News