Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 06:17 AM

నూజివీడు మండలంలో కోడి పందాలు, పేకాటపై పోలీసుల మెరుపు దాడులు

నూజివీడు మండలంలో కోడి పందాలు, పేకాటపై పోలీసుల మెరుపు దాడులు

నూజివీడు మండలంలో కోడి పందాలు, పేకాటపై పోలీసుల మెరుపు దాడులు
March 08, 2026 08:18 AM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై నూజివీడు రూరల్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. నూజివీడు రూరల్ ఎస్‌ఐలు జ్యోతిబసు, లక్ష్మణ్ బాబు సిబ్బందితో కలిసి దాడి చేసి 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 6 కోడి పుంజులు, 2 కోడి కత్తులు, 6 మోటార్ సైకిళ్లు, రూ.5,440 నగదును స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా రేగుంట గ్రామ పరిధిలో పేకాట జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో పేకాట నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.4,340 నగదును స్వాధీనం చేసుకున్నారు.

నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్, రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐలు మాట్లాడుతూ మండలంలో జూదం, కోడి పందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే డయల్ 112కు లేదా నూజివీడు రూరల్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

నేర రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News