Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:50 AM

నియోజకవర్గ సాధన దిశగా అడుగులు… సర్పంచులకు సన్మానం

30-03-2026 127 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నియోజకవర్గ సాధన దిశగా కసరత్తులు వేగం పుంజుకుంటున్నాయి. రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో పల్లివాడ, ఎల్లంకి, సర్నేనిగూడెం గ్రామాల సర్పంచులకు ఘన సన్మానం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల ఎన్నికైన పల్లివాడ సర్పంచ్ ఖమ్మంపాటి శ్రీనివాస్, ఎల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, సర్నేనిగూడెం సర్పంచ్ గంగాదేవి స్వామి గార్లను సన్మానిస్తూ, నియోజకవర్గ సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ… రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించడం లక్ష్యంగా సమితి కృషి చేస్తోందని తెలిపారు. ఈ దిశగా గ్రామాల ప్రజాప్రతినిధుల సహకారం కీలకమని పేర్కొన్నారు. సర్పంచులతో జరిగిన చర్చలో వారు సానుకూలంగా స్పందిస్తూ, రామన్నపేటను నియోజకవర్గంగా చూడాలని తమకూ ఆకాంక్ష ఉందని, ఈ ఉద్యమంలో భాగస్వాములమై సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ సన్మాన కార్యక్రమంలో పోషబోయిన మల్లేశం, సమితి కార్యదర్శి గడ్డం యాదగిరి, ఏండి ఫజల్, నకరెకంటి అశోక్, బోయిన ఆనంద్, పెండెం రవీందర్, పోచబోయిన మల్లేష్, దండుగుల రాములు, వనం చంద్రమౌళి, శ్రీరామోజీ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నియోజకవర్గ సాధన దిశగా అడుగులు… సర్పంచులకు సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News