Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:08 PM

నిషేధిత భూములపై దుష్ప్రచారం నమ్మొద్దు

నిషేధిత భూములపై దుష్ప్రచారం నమ్మొద్దు

నిషేధిత భూములపై దుష్ప్రచారం నమ్మొద్దు
08-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాట్సాప్‌ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు

భువనగిరి, మార్చి 7: నిషేధిత భూములు, నిషేధిత ఇండ్ల (నాల భూములు) జాబితా విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఆర్డీవో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజిస్ట్రేషన్ యాక్ట్–1908 సెక్షన్ 22–A ప్రకారం ప్రొహిబిటెడ్ ప్రాపర్టీల జాబితా చాలా కాలంగా అమల్లో ఉందని స్పష్టం చేశారు.

నిషేధిత జాబితాలో ఇవే

ప్రభుత్వ భూములు, చెరువు శికం భూములు, దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూములు, భూదాన్ భూములు, సీలింగ్ భూములు నిషేధిత జాబితాలో ఉంటాయని తెలిపారు. అలాగే ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూములు కూడా ఈ జాబితాలో ఉంటాయని పేర్కొన్నారు.

అభివృద్ధి పనుల భూములూ నిషేధమే

రోడ్లు, రైల్వేలు, నీటి పారుదల ప్రాజెక్టులు, కాలువలు, వీకర్ సెక్షన్ ఇండ్ల స్థలాలు, 2 బీహెచ్‌కే ఇండ్ల కోసం సేకరించిన భూములు కూడా సెక్షన్ 22–A కింద ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

లావుని పట్టా భూములపై కొనుగోలు–అమ్మకాలు నిషేధం

స్వాతంత్ర్యం తర్వాత భూమిలేని నిరుపేదలకు కేటాయించిన లావుని పట్టా భూములు అమ్మకం, కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఆ భూములు వారసులకు మాత్రమే చెందేలా ప్రభుత్వం ఈ నిబంధనలు అమలు చేస్తోందని చెప్పారు.

దుష్ప్రచారంపై హెచ్చరిక

ఈ విషయంపై కొందరు వ్యక్తులు ప్రజల్లో భయం, అపోహలు కలిగించేలా వాట్సాప్‌ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హెచ్చరించారు

Sthanikam

నిషేధిత భూములపై దుష్ప్రచారం నమ్మొద్దు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News