Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:48 AM

నిరుద్యోగులను మోసం చేయడం ఆపాలి: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్

01-04-2026 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామంలో డివైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే ఇప్పటికీ ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని విమర్శించారు.

గత ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుందని అన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులు తగిన విధంగా ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గద్దపాటి సుధాకర్, పొన్న సురేష్, మల్లేష్, శ్రీనివాస్, వేణు, నాగరాజు, రమేష్, సాయి, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుద్యోగులను మోసం చేయడం ఆపాలి: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్

Article Image

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామంలో డివైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే ఇప్పటికీ ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని విమర్శించారు.

గత ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుందని అన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులు తగిన విధంగా ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గద్దపాటి సుధాకర్, పొన్న సురేష్, మల్లేష్, శ్రీనివాస్, వేణు, నాగరాజు, రమేష్, సాయి, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News