Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:50 AM

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్ ఐ నాగరాజు

29-03-2026 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు:

ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్సై నాగరాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నరసింహులగూడెం గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ ప్రచారం 3వ విడత చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్ ఐ నాగరాజు గ్రామస్తులకు ట్రాఫిక్ నియమాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని తెలిపారు.

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, కుటుంబాలపై పడే ప్రభావం, చట్టపరమైన చర్యల గురించి వివరించారు. క్షణిక నిర్లక్ష్యం ప్రాణనష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు.

అలాగే మొబైల్ వాడకం, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలను నివారించాలని సూచించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని ఎస్సై నాగరాజు పిలుపునిచ్చారు.

Sthanikam

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్ ఐ నాగరాజు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News