Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

నేటి నుంచి జాతీయ రహదారులపై కఠిన టోల్‌ నిబంధనలు అమలు

15-04-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి కొత్త టోల్‌ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాణిజ్య వాహనాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

కొత్త నిబంధనల ప్రకారం, వాహనం అనుమతించిన లోడుతో పోలిస్తే 10 నుంచి 40 శాతం వరకు అధికంగా లోడ్‌ తీసుకెళ్తే, సాధారణ టోల్‌ రుసుముకు రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 40 శాతం కంటే ఎక్కువ ఓవర్‌లోడ్‌ ఉన్న వాహనాలపై మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. అలాంటి వాహనాలకు టోల్‌ రుసుము నాలుగు రెట్లు వసూలు చేయనున్నారు.ఈ నిర్ణయం ద్వారా రహదారుల దెబ్బతినడం తగ్గించడంతో పాటు, రోడ్డు భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. తరచుగా ఓవర్‌లోడ్‌ కారణంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా వెయింగ్‌ మెషీన్ల ద్వారా వాహనాల బరువును తనిఖీ చేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎటువంటి రాయితీలు ఉండవని స్పష్టం చేశారు.ఈ కొత్త రూల్స్ అమలుతో ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో కొంత మార్పు రావచ్చని, వాహనదారులు కూడా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Sthanikam

నేటి నుంచి జాతీయ రహదారులపై కఠిన టోల్‌ నిబంధనలు అమలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News