Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

నేతన్నల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

20-04-2026 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో 'నేతన్నకు ఆరోగ్య భద్రత' మెగా వైద్య శిబిరం ప్రారంభం

కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

​చేనేత కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ పట్టణంలోని మార్కండేయ ఆలయ ప్రాంగణంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నిర్వహించిన 'నేతన్నకు ఆరోగ్య భద్రత' మెగా వైద్య శిబిరాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవలు ​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. నిరంతరం శ్రమించే చేనేత కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. వారి ముంగిటకే వైద్య సేవలను తీసుకురావాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిబిరానికి వచ్చిన చేనేత కార్మికులకు వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.​"చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా పాలనలో భాగంగా ప్రతి కార్మికుడికి ఆరోగ్య భద్రత కల్పించడమే మా బాధ్యత."ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ దేప రమ్య రాజు, పిల్లలమర్రి మధుసూదన్, వైద్య అధికారులు డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ కాటమరాజు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సేవలు అందించారు. పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

నేతన్నల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News