Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నీట్ పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: సీపీఐ(ఎం) తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 23, 2026 11:39 PM

నీట్ పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: సీపీఐ(ఎం)

నీట్ పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: సీపీఐ(ఎం)

నీట్ పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: సీపీఐ(ఎం)
July 23, 2026 09:18 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
  1. విద్యార్థులపై లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండించిన సీపీఐ(ఎం) నేతలు
  2. నీట్ లీకేజీపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  3. నల్లగొండలో సుభాష్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం
  4. చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిక


నీట్ పేపర్ లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ జరపడం తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డిడిమాండ్ చేశారు.

గురువారం నల్లగొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహంవద్ద సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీపై న్యాయం కోరుతూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బలప్రయోగానికి దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.

ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత దెబ్బతిన్నప్పటికీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ నిర్వహించి, కుట్రకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనకు రాజకీయ, పరిపాలనా బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు.

విద్యా వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిర్వహించిన ఆందోళనపై పోలీసులు బలప్రయోగం చేయడం విచారకరమన్నారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉందని, అలాంటి హక్కును అణచివేయడం సరికాదన్నారు. విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా జూలకంటి రంగారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో విద్య, ఉపాధి, రైతాంగం, కార్మిక రంగాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించకుండా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డిమాట్లాడుతూ, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వినకుండా బలప్రయోగానికి దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. నీట్ పేపర్ లీకేజీపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుబండ శ్రీశైలం, కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులుమహ్మద్ సలీం, దండంపల్లి సత్తయ్య, కంబాలపల్లి ఆనంద్, బొజ్జ వెంకులు, నాయకులు నలపరాజు సైదులు, లింగస్వామి, సరోజ, దొంగరి వెంకన్న, బొల్లు రవీందర్, సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు.

సీపీఐ(ఎం) నాయకులు విద్యా వ్యవస్థలో విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించి విద్యార్థుల్లో విశ్వాసాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News