Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:10 PM

నీట్ లీకేజీపై నల్లగొండలో న్యాయవాదుల నిరసన

21-07-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్ల బ్యానర్లతో ఆందోళన.. విద్యార్థుల అరెస్టులను ఖండించిన లాయర్లు.

నల్లగొండ, జూలై 21:

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా న్యాయవాదులు సోమవారం నల్ల బ్యానర్లతో నిరసన చేపట్టారు. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దమనకాండను ఖండిస్తూ జిల్లా న్యాయస్థానం ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీపై పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్‌లు, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి, ముఖ్యంగా యువతకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, ఆ హక్కును ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు. నిరసనల సందర్భంగా అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని కోరారు.విద్యార్థుల న్యాయమైన ఉద్యమాలకు నల్లగొండ జిల్లా న్యాయవాదుల సంపూర్ణ సంఘీభావం ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జి. మోహన్‌తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Sthanikam

నీట్ లీకేజీపై నల్లగొండలో న్యాయవాదుల నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News