Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:22 AM

న్యాల్కల్ అంగన్వాడి 4వ కేంద్రంలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

18-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని అంగన్వాడి 4వ సెంటర్‌లో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. టీచర్ జగదీశ్వరీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం చిన్నారుల ఆనందోత్సాహాలకు వేదికగా నిలిచింది.విద్యా సంవత్సరం పూర్తి చేసిన చిన్నారులు గ్రాడ్యుయేషన్ డ్రెస్‌లలో మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకున్నారు. చేతుల్లో సర్టిఫికెట్లు పట్టుకుని భవిష్యత్తు లక్ష్యాల వైపు తొలి అడుగులు వేస్తూ కనిపించారు. చిన్నారుల అమాయకత్వం, ఉత్సాహం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యాల్కల్ జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ మల్లేశ్వరి, థాఫీఖ్ బేగం అయ్యమ్మ హాజరై చిన్నారులను అభినందించారు. వారు మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని, చిన్నారుల్లో విద్యాపై ఆసక్తిని పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పిల్లల విజయాలను ఆనందంగా వీక్షించారు. గ్రామ ప్రజలు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.మొత్తంగా ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఆనందభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడి అందరి ప్రశంసలు అందుకున్నాయి.

Sthanikam

న్యాల్కల్ అంగన్వాడి 4వ కేంద్రంలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News