Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:48 AM

నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలి: యాదవ నేతల డిమాండ్

30-03-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రంలో ఏకైక యాదవ ఎమ్మెల్యేగా ఉన్న నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని యాదవ నేతలు డిమాండ్ చేశారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షుడు మేకల మల్లి బాబు యాదవ్, యాదవ యువజన జిల్లా అధ్యక్షుడు చిత్తారు సింహాద్రి యాదవ్ పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 5న ఖమ్మం బైపాస్ రోడ్డులోని రామకృష్ణ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఇటీవల ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన యాదవ కురుమ సర్పంచులు, ఉపసర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ఈ కార్యక్రమంలో సన్మానం నిర్వహించనున్నట్లు తెలిపారు.

సోమవారం కూసుమంచి, జలగం నగర్ ప్రాంతాల్లో సర్పంచులు, కౌన్సిలర్ల సమక్షంలో సన్మాన కార్యక్రమ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 18 శాతం ఉన్న యాదవ కురుమలకు తగిన రాజకీయ ప్రాధాన్యత లభించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని, యాదవ కురుమలకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు.

గత ప్రభుత్వం గొర్రెల పెంపకం దారుల సంఘాలను నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటివరకు తగిన ప్రయోజనాలు అందలేదని, సత్వరమే ప్రత్యేక నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చెన్ను వెంకటరమణ, మెండే వెంకటేష్, బత్తుల వీరస్వామి, బుర్ర కృష్ణ, కనకయ్య, లింగయ్య, నీలకంఠం, శోభన్ బాబు, వెంకటరమణ, కౌన్సిలర్లు బోయిన కుమారి, బుర్ర మహేష్, సాయి, గౌరుమాళ్ళ, మలాది మల్లయ్య, ఏర్పుల శ్రీనివాసరావు, వీరభద్రం, నాగరాజు, శివ, రవి, యాదగిరి, ఉపేందర్, గంగయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలి: యాదవ నేతల డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News